సోనాలీబింద్రే ని గుర్తుచేసుకొని కంటనీరు పెట్టుకున్న హీరో

సోనాలీబింద్రే ని గుర్తుచేసుకొని కంటనీరు పెట్టుకున్న హీరో

0
125

సీనియర్ హీరోయిన్ అందాల నటి సోనాలీబింద్రే క్యాన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. ఆమె అనారోగ్యం బారిన పడకముందు సోనాలీ ‘ఇండియాస్ బెస్ట్ డ్రామాబాజే’ షోలో జడ్జిగా వ్యవహరించారు.

ఈ సమయంలోనే క్యాన్సర్ సోకిందని తెలియడంతో షో నుంచి తప్పుకొని, చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారు. కాగా ఈ షోలో సోనాలీతో పాటు బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్, ఓమంగ్‌ కుమార్‌లు కూడా జడ్జీలుగా వ్యవహరించారు. తాజాగా ఈ షోలో పాల్గొన్నవివేక్… తమ సహా నటి సోనాలీని గుర్తుచేసుకుని వెక్కివెక్కి ఏడ్చారు. షోలో భాగంగా ఒక కంటెస్టెంట్ క్యాన్సర్ బాధితురాలి పాత్ర పోషించారు. దీనిని చూసిన వివేక్ ఆ క్షణంలో సోనాలీని గుర్తుకు తెచ్చుకుని వెక్కివెక్కి ఏడ్చేశారు.