దూదేకుల కార్పొరేషన్ కావాలి

0
103

తెలంగాణా రాష్ట్ర విధ్యత్ శాఖ మంత్రి జగధీష్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సూర్యపేట జిల్లా మైనారిటీ ముస్లిం దూదేకుల సంఘం జిల్లా కమిటీతో ఆల్ఇండియా మన్సూరి /దూదేకుల సంక్షేమ సంఘం జాతీయ ఇన్చార్జి షేక్ షకీనా, తెలంగాణ రాష్ట్ర దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సిధ్ధాసాహేబ్, జాతీయ నాయకులు&దూదేకుల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ షేక్ జానీ భాయ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు లతీఫ్బీ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రికీ, దూదేకుల ఆత్మ గౌరవ భవనాలు కేటాయించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు వివరించారు.

1. తెలంగాణ రాష్ట్రం లో వెనుకబడిన దూదేకుల సంఘీయుల కోరకు ఆర్థిక చేయితనందించేందుకు గాను దూదేకుల కార్పొరేషన్ ఎర్పాటు చేయాలని.

2.బి.సి-బిలో వున్న దూదేకుల సంఘీయులను బి.సి-ఈ రిజర్వేషన్లో కలపాలని.

3.తెలంగాణ రాష్ట్రంలో తెరాసలో పనిచేసే దూదేకుల సంఘ తెరాస నాయుకులకు MLC లుగా, రాష్ట్ర & జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులలో అవకాశం కలిపించాలని.

4.అసెంబ్లీ సమావేశంలో మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు దూదేకుల రిజర్వేషన్లు గురించి మాట్లాడారని, నల్గొండ, సూర్యాపేట నియోజకవర్గాలలో నిరంతరం తెరాస పార్టీలో పనిచేస్తున్న దూదేకుల సంఘీయులకు కూడా నామినేటెడ్ పదవులలో అవకాశం కలిపించాలని, మంత్రి గారికి వినతిపత్రాన్ని అందించి, విన్నవించటం జరిగింది.