ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు, రోహిత్ ఎందుకు ఆడటం లేదు అని అనేక అనుమానాలు ప్రశ్నలు వచ్చాయి..మొన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ నుంచి తప్పుకున్న హిట్మ్యాన్.. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కూడా ఆడలేదు.
అతడి స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు, అయితే రోహిత్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున అతను ఆడాలి అని కోరారు, ఆయనకు ఏమైంది అనే ఆతృత అందరికి ఉంది, ఇక అపజయంతో నేడు మరింత మంది దీనిని ప్రశ్నిస్తున్నారు.
రోహిత్ శర్మ ఆరోగ్యం బాగోలేదని పొలార్డ్ వెల్లడించాడు. తాజాగా ఫ్యాన్స్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు స్పష్టతనిచ్చింది. రోహిత్ శర్మ కొన్ని రోజులుగా తొడ గాయంతో బాధపడుతున్నాడు. తొడ నరం పట్టేసి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు చికిత్స తీసుకున్నాడు అని తెలిపింది, కొద్ది రోజుల్లో జట్టులోకి వస్తారు అని తెలిపింది.