Womens World Cup: చేతులెత్తేసిన మిథిలి సేన..బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

0
76

ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. సెమీ ఫైన‌ల్స్ కు వెళ్లాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో మిథిలి సేన చేతులేత్తిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 229 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ మ్యాచ్ లో ఓపెన‌ర్లు స్మృతి మంద‌న్న (30), షాఫెలి వ‌ర్మ (42) రాణించినా టాప్ ఆర్డ‌ర్, మిడిల్ ఆర్డర్.. దారుణంగా విఫ‌లం అయింది. య‌స్తికా భాటియా (50) ఒక్క‌రే అర్థ శ‌త‌కం న‌మోదు చేసింది. కాగ ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే.. సెమీస్ ఆశలు ఉంటాయి. ఓడితే టోర్నీ నుంచి త‌ప్పుకోవాల్సి ఉంటుంది.