మనలో చాలా మంది పూజ గదిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు. కొందరు తూర్పు ఫేసింగ్ -దక్షిణం ఫేసింగ్ ఇళ్లల్లో ముందు భాగంలో పెద్ద విగ్రహాలు పెడతారు. అయితే పండితులు వాస్తు నిపుణులు ఏమంటున్నారు ఇలా పెట్టుకోవచ్చా అనేది ఓసారి చూద్దాం.
ముఖ్యంగా పూజాగదిలో మాత్రమే చిన్న విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. ఇక మన అరచేయి అంత సైజ్ ఉండే విగ్రహాలు మాత్రమే పెట్టుకోవాలి అని చెబుతున్నారు. విగ్రహాలను ఎప్పుడూ ఉత్తర దిక్కు పెట్టకూడదు. దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు, పగిలిన పటాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు.
విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఏ దేవుడి విగ్రహం అయినా ఒక దేవుడిని మరొకరు చూసే విధంగా విగ్రహాలు పెట్టకూడదు అంటున్నారు పండితులు. గోడకు అంగుళం దూరంలో విగ్రహాలు పెట్టాలి. దీపాలు విగ్రహానికి ఎదురుగా పెట్టాలి పక్కన పెట్టకూడదు.
పూజా సామాగ్రిని ఆగ్నేయ దిక్కున పెట్టుకోండి.అరుగులపై విగ్రహాలు పటాలు పెట్టకుండా చెక్కపై లేదా పాలరాయి లేదా పీఠం లాంటి వాటిపై పెట్టండి. ఇంట్లో ఉండే విగ్రహాలు పెద్దవిగా ఉంటే వాటికి మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ సరిపోదు. విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేస్తాము అంటే పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు.