పంత్​, శ్రేయస్​ ఉండగా..వైస్​ కెప్టెన్సీ బుమ్రాకే ఎందుకు..బీసీసీఐ క్లారిటీ!

While Pant and Shreyas, why vice-captaincy is Bumra? BCCI Clarity!

0
100

భారత క్రికెట్లో బౌలర్లకు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. కానీ, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం సీనియర్‌ బౌలర్ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అయితే, ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్లుగా నిరూపించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండగా.. బుమ్రాకే ఎందుకు ఆ బాధ్యతలు అప్పగించారనే విషయంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. “ఇటీవల ఆసీస్‌ సీనియర్‌ బౌలర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే, మేం బుమ్రాకు బాధ్యతలు అప్పగించాం.

అతడు 2016 నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎలివేట్‌ చేస్తే.. శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు నిలకడగా రాణించేందుకు ప్రయత్నిస్తారని సెలెక్టర్లు భావించి ఉండొచ్చు. ఎలాగూ వెస్టిండీస్, శ్రీలంక జట్లతో స్వదేశంలో జరుగనున్న సిరీసులకు వన్డే కెప్టెన్ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వస్తాడు. కాబట్టి ఈ ఒక్క సిరీస్‌కే బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.