ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆటకు అందరూ అభిమానులే మంచి హిట్టర్ బ్యాట్స్ మెన్ గా పేరు ఉంది, పైగా గ్రీజులో ఉంటే గెలుపు తీరాలకు తీసుకువెళతాడు అనే పేరు ఉంది, అయితే గత సీజన్ లో అతని ఆటతీరు పెద్దగా ప్రభావం చూపించలేదు అయినా అతనికి ఐపీఎల్ లో ఫేమ్ అలాగే ఉంది అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
గత సీజన్లో అతనికి పది కోట్లు ఇచ్చిన పంజాబ్ తరఫున ఆడి దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. సిక్సులకి కేరాఫ్ అడ్రస్ అయిన అతను ఇలా ఆడతాడు అని ఎవరూ ఊహించలేదు, అయితే ఈ టీమ్ అతన్ని వదిలేసింది.
కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. సో బెంగళూరు అభిమానులు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు, అతని వల్ల టీమ్ కు మంచి బూస్ట్ అవుతుంది అంటున్నారు.