IPL 2022: ఆర్సీబీకి నయా సారథి..విరాట్ కోహ్లీ వారసుడు ఎవరంటే?

0
107

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి.

కాగా ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. గతంలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ వేట ప్రారంభించింది ఆర్సీబీ. మ్యాక్స్ వెల్, దినేష్ కార్తిక్, డుప్లెసిస్ లలో కెప్టెన్ నియమిస్తారని తెలిసింది.

తాజాగా ఈ మేరకు ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్ ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది ఆర్సీబి. మెగా వేలంలో ఆర్‌సీబీ టీం డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. IPL-2022 కోసం చెన్నై అతన్ని రిటైన్ చేయలేదు. దక్షిణాఫ్రికా టీం కూడా డు ప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.  . ఆర్‌సీబీ ఐపీఎల్‌లో మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కొత్త కెప్టెన్‌ అయినా టైటిల్ అందిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.