ఆషాఢం శుభకార్యాలకు మంచిది కాదు అంటారు. ఈ సమయంలో వివాహాలు జరగవు. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. అందుకే పూజారులు పెళ్లి తంతు చేయడం కుదిరేది కాదట.
ఇక వర్షాలు కురవడంతో పొలం పనులు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి శూన్య మాసం కావడంతో పాటు దీక్షకు సంబంధించిన మాసం. అందుకే ఆషాఢంలో గర్భధారణకు అనుకూలమైన మాసం కాదని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ నెలలో పెళ్లిళ్లు చేయరు.కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పుట్టింటికి పంపుతారు. ఇక భార్య భర్తలు ఈ సమయంలో దూరం ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమయంలో కలవడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భం వస్తే వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఎండ తీవ్రతకి ఇబ్బంది ఉంటుంది. అందుకే ఈ నెలలో కలిసి ఉండవద్దు అంటారు.
ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట. దీంతో వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు అందవట. ఈ సమయంలో పంట చేతికి రాదు. రైతులు చేతిలో నగదు లేకపోవడంతో పెళ్లి ముహూర్తాలు ఈ సమయంలో వద్దు అంటారు. ఈ నెలలో వానలు, తుఫానులు వస్తాయి. అందుకే పెళ్లికి నో చెబుతారు. అయితే ఆ రోజుల్లో అందరూ రైతులుగా ఉండేవారు కాబట్టి వీటిని పాటించేవారు. నాటి నుంచి నేటి వరకూ మనం ఇదే సంప్రదాయం ఫాలో అవుతున్నాం.