IPL: మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొట్టేనా?..ధోని సేన బలాలు, బలహీనతలు ఇవే..

0
115

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికసార్లు ఫైనల్‌కు దూసుకెళ్లిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ CSK. లీగ్​ చరిత్రలోనే రెండో విజయవంతమైన జట్టుగా సీఎస్​కే రికార్డు సృష్టించింది. తొలి ఎడిషన్‌ నుంచి సీఎస్‌కేను నడిపిస్తోన్న ఏకైక సారథి ఎంఎస్ ధోనీ.. బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోయినా కెప్టెన్సీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ఏకంగా నాలుగుసార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపాడు. మరి ఈసారి సిఎస్కె కప్పు కొడుతుందా? ప్రస్తుతం ఆ జట్టు బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం.

సిఎస్కెకు ప్రధాన బలం ధోని. తన యొక్క ఆలోచనలతో ప్రత్యర్ధులను ఓడించడంలో దిట్ట. అలాంటి ధోని గత ఐపీఎల్ లో బ్యాట్ తో విఫలమయ్యాడు. కానీ కప్పు అందించడంలో మాత్రం విజయవంతం అయ్యాడు. ఈ సరి సిఎస్కె ధోనీతో పాటు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌కు చెందిన మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌ను సీఎస్‌కే రిటెయిన్‌ చేసుకుంది. వీరందరూ జట్టుకు ప్రధానాస్త్రాలు. అయితే మిగతా ఆటగాళ్లు ఆడితేనే జట్టుకు విజయం చేకూరుతుంది.

వీరితో పాటు వేలంలో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హరి నిషాంత్‌, జగదీశన్‌, కేఎం అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, శివమ్ దూబె, క్రిస్‌ జొర్డాన్‌, మహీశ్ తీక్షణ, ప్రిటోరియస్, డేవన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సేనాపతి, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకీ, భగత్‌వర్మ వంటి ఆటగాళ్లను సొంతం చేసుకుంది.

గతంతో పోలిస్తే చెన్నై బలం పెరిగిన ప్రధాన ఆటగాళ్లు చేజారిపోయారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ డుప్లెసిస్‌, స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ సేవలు కోల్పోవడం దెబ్బె. అలాగే జట్టు కూర్పు సరిగా లేకపోతే చెన్నె కప్పు కొట్టడం కష్టమే. అయితే ధోనికున్న అనుభవం జట్టుకు సానుకూలాంశం. కప్పు కొట్టడానికి అన్ని అస్త్రాలు ఉన్న చెన్నై శ్రమించక మాత్రం తప్పదు.