ధోనీ రికార్డుకు చేరువలో యువ క్రికెటర్​..అగ్రస్థానంలో నిలుస్తాడా?

Will Dhoni be the youngest cricketer to reach the record?

0
77

మహేంద్ర సింగ్​ ధోనీ. ఈ పేరు వినగానే టీమ్​ఇండియా బెస్ట్​ వికెట్​ కీపర్​, కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. టెస్టుల్లో కూడా కీపర్​గా భారత్​ తరపున అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇప్పుడు ఓ యువక్రికెటర్​ ధోనీ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఆ రికార్డు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

కీపర్​గా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు దిగ్గజ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ పేరున ఉంది. అయితే ఇప్పుడు ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు యువక్రికెటర్​ రిషబ్​ పంత్​. టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఒకవేళ పంత్​కు ఆడే అవకాశం వస్తే..ఈ రికార్డును తిరగరాసే అవకాశం ఉంది.

ధోనీ 36 టెస్ట్​ మ్యాచుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు పంత్ ఇప్పుటివరకు 25 మ్యాచ్​లు ఆడగా.. 97 వికెట్లు పడగొట్టి ధోనీ రికార్డ్​కు చేరువలో ఉన్నాడు. ఇదే జరిగితే టెస్టుల్లో 100 వికెట్లు తీసిన ఆరో భారతీయ ఆటగాడిగా పంత్​ నిలుస్తాడు. అంతేకాదు ధోనీని వెనక్కునెట్టి అగ్రస్థానం సంపాదిస్తాడు.