ఇక ఏసీలు అక్కర్లేదు -ఈ ఒక్క పేపర్ తో రూమ్ అంతా కూల్ కూల్

With Out Ac- Cool all over the room with this single paper

0
86

ఈ రోజుల్లో ఎండ వేడి తట్టుకోలేక ఏసీలు కొంటున్నారు అందరూ. అయితే ఈ ఏసీల వల్ల పర్యావరణానికి చేటు. అంతేకాదు కరెంట్ ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాని కొత్త ఆవిష్కరణతో ఇక మీరు ఏసీలు కొనక్కర్లేదు. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు కరెంట్ కూడా అక్కర్లేదు. మీ ఇల్లు చల్లచల్లగా కూల్ కూల్ అయిపోతుంది. పేపర్ తో ఇళ్లు కూల్ అవ్వడం ఏమిటని అనుకుంటున్నారా. సో అదే తెలుసుకుందాం.

రూఫింగ్ మెటేరియల్ ఇది చెప్పాలంటే కూలింగ్ పేపర్ మెటేరియల్.. సూర్య కిరణాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని లాగేసుకుంటుంది. ఇది ఇంట్లో పేస్ట్ చేస్తే చాలు కూల్ గా ఉంటుంది రూమ్. దీనిని రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. అమెరికాలో 87 శాతం ఇళ్లల్లో ఏసీలు ఉంటాయి. ఏడాదికి ఒక్కో ఇంటికి 265 డాలర్లు ఖర్చు కూడా అవుతుంది. ఇది చాలా మందికి ఇబ్బందిగా ఉంటోంది.

ఈ కూలింగ్ పేపర్ ఇంట్లో ఉంటే ఏసీతో పాటు కరెంట్ కూడా అక్కర్లేదు. నార్త్ ఈస్టరన్ యూనివర్శిటీకి చెందిన మెకానికల్, ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ అసొసియేట్ ప్రొఫెసర్ Yi Zheng దీనిని తెలిపారు. సో ఈ ఆవిష్కరణ చాలా మందిని ఆకట్టుకుంటోంది. .