రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి : కుమార్తెకు గాయాలు

0
91

రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా ఎఎస్ఐ మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ వద్ద జరిగింది. ఎఎస్ఐ భాగ్యలక్ష్మి తన కుమార్తెను వెనకాల కూర్చోబెట్టుకుని స్కూటీ మీద వెళ్తున్నారు. కమాన్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో భాగ్యలక్ష్మి మీదుగా లారీ వెళ్లిపోయింది. ఆమె శరీరం అంతా నుజ్జు అయింది. కూతురు కి తీవ్ర గాయాలయ్యాయి. లారీ గుజరాత్ కు చెందినదిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తీరును చూసి స్థానికులు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.