సంచలన నిర్ణయం తీసుకున్న జగన్

సంచలన నిర్ణయం తీసుకున్న జగన్

0
34

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరుపడుతుండటంతో అధికార, ప్రతిపక్షపార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అధికార పార్టీలు ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా 2014లో చేజారిన సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ భగీరథ ప్రయత్నాలు చేస్తోంది.

ఆగస్ట్ 2 నుంచి వైసీపీ వినూత్న ప్రచార శంఖారావంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. తొలిదశలో మూడు నెలల పాటు పార్టీ నేతలు ప్రచారం చేయనున్నారు. ఆగస్ట్ 2 నుంచి అక్టోబర్ 16 వరకు గ్రామాల్లోకి వైసీపీ వెళ్లనుంది. ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో వైసీపీ నేతలు గ్రామ గ్రామాన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి గాను ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నింటిపై ఈ నెల 29న వైసీపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలతో వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జరగనుంది. కాగా వైఎస్ జగన్ ప్రస్తుతం జగ్గంపేటలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ సాగుతోంది.