సాక్ష్యం మూవీ రివ్యూ

సాక్ష్యం మూవీ రివ్యూ

0
72

చిత్రం:సాక్ష్యం
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ – పూజా హెగ్డే – జగపతిబాబు – రావు రమేష్ – వెన్నెల కిషోర్ – రవికిషన్ – అశుతోష్ రాణా – శరత్ కుమార్ – మీనా – జయప్రకాష్ – పవిత్ర లోకేష్ – బ్రహ్మాజీ – ఝాన్సీ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: అభిషేక్ నామా
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీవాస్క‌

క‌థ:

స్వ‌స్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శ‌ర‌త్‌కుమార్‌) పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వ్య‌క్తి. అదే ప్రాంతంలో ఉండే మున‌స్వామి అత‌ని త‌మ్ముళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అత‌ని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.

అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సౌంద‌ర్య తండ్రి మున‌స్వామి ఆక్ర‌మాల‌కు అడ్డుప‌డుతుంటాడు. మున‌స్వామికి వ్య‌తిరేకంగా కొన్ని సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంటాడు. మున‌స్వామి త‌మ్ముడు వీరాస్వామి(ర‌వికిష‌న్‌) సౌంద‌ర్య‌ను చంపేయాల‌నుకుంటాడు. కానీ ప్ర‌కృతి కార‌ణంగా చ‌నిపోతాడు. దానికి విశ్వ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చ‌స్తారు. అస‌లు మున‌స్వామి అండ్ బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

బెల్లంకొండ శ్రీనివాస్ నటుడిగా కొత్తగా చేసిందేమీ లేదు. గత సినిమాల్లో మాదిరే కనిపించాడు. లుక్ పరంగా మెరుగయ్యాడు. మరింత ఫిట్ గా కనిపించాడు. బాగా బాడీ బిల్డ్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో మరోసారి మెప్పించాడు. డ్యాన్సుల్లోనూ ఆకట్టుకున్నాడు. ఐతే ‘జయ జానకి నాయక’లో మాదిరి అతను ఎమోషన్లు చూపించడానికి ఈ సినిమా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. పూజా హెగ్డేకు కూడా నటించేందుకు పెద్దగా ఆస్కారం లేదు. ఆమె గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. విలన్ పాత్రలో జగపతిబాబు మెప్పించాడు. రావు రమేష్ పర్వాలేదు. రవికిషన్.. అశుతోష్ రాణా పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. జయప్రకాష్.. పవిత్ర లోకేష్.. శరత్ కుమార్.. మీనా ఉన్న కాసేపట్లో బాగానే చేశారు. వాల్మీకి పాత్రలో అనంత్ శ్రీరామ్ విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. వెన్నెల కిషోర్ ఏమాత్రం నవ్వించలేకపోయాడు. స్క్రీన్ టైం చాలానే ఉన్నప్పటికీ అతడి పాత్ర వృథా అయింది. మిగతా నటీనటులంతా మామూలే.

ప్లస్ పాయింట్స్ :

వీడియో గేమ్ డెవలపర్‌ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో, గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన ఇంట్రడక్షన్ సీన్‌లోని అడ్వంచరస్ చిన్న పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ఇక హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.

దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రంతో తనలోని ఓ కొత్త యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. పంచభూతాలు ను ఉపయోగించుకొని స్క్రీన్ ఫ్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలోనే సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రకృతిని కేంద్రబిందువుగా చెయ్యాలనుకున్న ఆయన ప్రయత్నం మెచ్చుకోదగినది.

జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి లాంటి మంచి నటులు ఈ చిత్రంలో విలన్ల పాత్రలను పోషించి ఈ చిత్రాన్ని మరో స్థాయికు తీసుకెళ్లారు ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రల్లో నటించిన శరత్ కుమార్, మీనా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఓ కొత్త పాయింట్‌ తో కూడుకున్న విభిన్నమైన కథ మా చిత్రం అని సాక్ష్యం చిత్రబృందం ప్రమోట్ చేసినప్పటికీ, సాక్ష్యం చిత్రం మాత్రం తెలుగు సినిమాల మాదిరిగానే రొటీన్ సినిమాలాగే ఐదు ఫైట్స్, సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతుంది.

సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో చూపినంత కొత్తధనం సినిమాలో ఎక్కడా కనిపించదు.

పంచభూతాలు హీరోకి సాయపడే విధానం బాగున్నప్పటికీ మరి నాటకీయంగా అనిపిస్తాయి. మునుస్వామి (జగపతిబాబు) అతని తమ్ముళ్లు చేసే హత్యలు అన్యాయాలు వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాని సినిమాలానే చూస్తారు తప్ప, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందర్భాలు చాల తక్కువ.

చివరగా: సినిమా ఓకే కానీ..రొటీన్

రేటింగ్-2/5