బిగ్ బాస్ లో కి మరో యంగ్ హీరో ఎంట్రీ

బిగ్ బాస్ లో కి మరో యంగ్ హీరో ఎంట్రీ

0
80

టాప్ రేటింగ్ రియాలిటీ షో బిగ్ బాస్..ఎప్పుడు కొత్తగా చూపించే ఈ షో లో రొమాంటిక్ స్టార్ గా ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న అర్జున్ రెడ్డి ఫేమ్…విజయ్ దేవరకొండ దర్శనమివ్వబోతున్నారు…

హాట్ గా సాగుతున్న బిగ్ బాస్ షో కి కూల్ రొమాంటిక్ స్టార్ ఎలా కూల్ చేస్తారో అని అందరు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..ఈ మధ్య బుల్లెట్ పై షర్ట్ లేకుండా తిరిగి ఓ బ్రాండ్ ని సంపాదించుకున్నాడు..ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట…

ఓ షాపింగ్ మాల్ నిర్వహించిన షర్ట్ బ్రాండ్ అంబాసిడర్ యాడ్ కాస్త ఫుల్ పాపులారిటీ సంపాదించి పెట్టారు..ఇప్పుడు సినిమాలో ఫుల్ బిజీ అయ్యాడు..”గీత గోవిందం ” ఈ సినిమా పాటలు నెట్లో వైరల్ అంటే ఎక్కువ వ్యూస్ ని దాటుకుంది..ఇప్పుడు సినీ థియేటర్లో దిగడానికి రెడీ అవుతుంది.

బిగ్ బాస్ హౌస్‌కి అర్జున్ రెడ్డిని షర్ట్ లేకుండా రప్పిస్తున్నట్లు సమాచారం. పనిలో పనిగా తన మూవీ ‘గీతా గోవిందం’ ప్రమోషన్స్‌గా కూడా బిగ్ బాస్ యూజ్ ఫుల్‌ అవుతుండటంతో విజయ్ దేవరకొండ బిగ్ బాస్‌ హౌస్‌కి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది. గతంలో అర్జున్ రెడ్డి ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 1లోనూ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ను అర్జున్ రెడ్డి కొనసాగిస్తారేమో చూడాలి. సీజన్ 2 లో జోష్ పెరిగింది కాబట్టి ఈ సినిమా కలెక్షన్ కూడా పెరుగుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు…