శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు

-

Cambodia |కంబోడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడిన ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కంబోడియా(Cambodia)లోని సయొమ్ రీఫ్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం 40 మొసళ్ల(Crocodiles)ను పెంచుతోంది. ఈ క్రమంలో వాటిని సంరక్షిస్తున్న ఓ వృద్ధుడు, తాజాగా ఓ మొసలి గుడ్లు పెట్టడంతో..దానిని బోనులో నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. చేతిలో ఉన్న కర్రతో దానిని కదిలించాడు. ఈ క్రమంలో ఆ మొసలి కర్రను లోపలికి లాక్కుంది. దాంతో ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. దాదాపు 40 మొసళ్లు దాడి చేయడంతో ఆ వృద్ధుడి శరీరం ముక్కలుగా అయ్యిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
2. స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...