MATI | భారత ప్రధాని మోదీ లక్షద్వీప్(Lakshadweep) పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇండియన్ సెలబ్రిటీస్ కూడా మాల్దీవులకు బదులు లక్షద్వీప్ ని టూర్ డెస్టినేషన్ చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు భారతీయులు మాల్దీవుల హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ తమ పర్యాటక రంగంపై దుష్ప్రభావం చూపుతున్నాయని మాల్దీవుల అధికార, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
భారత్ తో నెలకొన్న వివాదంతో నష్టం చవిచూస్తున్న వేళ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు మాల్దీవులు(Maldives) ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంపై మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI) తొలిసారి స్పందించింది. భారత్ సహా పీఎం మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత్ సన్నిహితమైన పొరుగుదేశం, మిత్రదేశంగా పేర్కొంటూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీకి భారత్ స్థిరమైన, గణనీయమైన సహకారం అందిస్తూ వస్తోందని మాటి (MATI) ప్రశంసించింది. వివిధ సంక్షోభాల సమయంలో భారత్ తమను ఆదుకుందని, అందుకు భారత్ పట్ల తాము ఎంతో కృతజ్ఞతతో ఉంటామని స్పష్టం చేసింది. కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ తర్వాత తాము కోలుకోవడానికి భారత్ చాలా సపోర్ట్ ఇచ్చిందని పేర్కొంది.
Read Also: మాల్దీవులకు మోదీ చెక్.. అసలు ఏం జరిగిందంటే?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat