దోహాలో భారత్ దబడిదిబిడే.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్

-

Alltime Report, Desk: దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిల్‌(ISSF World Championship)లో భారత్ అదరగొడుతోంది. భారత్ షూటర్లు ఒకరిని మించి మరొకరుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే భారత షూటర్లు సాధించిన రెండు గోల్డ్ మెడల్సే వారి అద్భుత ఫామ్‌కు నిదర్శనం. నవంబర్ 10న జరిగిన ఈ పోటీలో ఈషా సింగ్(Esha Singh), మను భాకర్(Manu Bhaker), దివ్య తడిగోల్ సుబ్బరాజు(Divya Thadigol Subbaraju)తో కూడిన భారత జట్టు ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 1761 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈషా సింగ్ 590 పాయింట్లతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు.

- Advertisement -

దక్షిణ కొరియా రజతం, వియత్నాం కాంస్య పతకాలను గెలుచుకోగా.. భారత్ 13 పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరిన ఈషా, మను తృటిలో పతకాలను కోల్పోయారు. అంతకుముందు నవంబర్ 3న పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లోనూ రవీందర్ సింగ్, సౌరభ్ చౌదరి, అమన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి స్వర్ణం అందించారు. రవీందర్ సింగ్ వ్యక్తిగత విభాగంలో రజతం కూడా సాధించారు. ప్రస్తుతం ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 2 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలతో పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Also Read : సూర్య రికార్డ్.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్‌లు!

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Alltime Report, Desk: అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈకి భారత్ చుక్కలు...

లేడీ సూపర్ స్టార్‌కు ప్లాప్‌లే ప్లాప్‌లు.. ‘రక్కాయి’పైనే ఆశలు..

Alltime Report, Desk : లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)ను వరుస...