Alltimereport : సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ప్రకటించారు. తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన చిన్నారిని పరిచయం చేస్తూ.. సమంత, రాజ్ నిడుమోరు పేర్లతో ఓ ఫోటో జత చేసిన ప్రత్యేక పోస్ట్ ను షేర్ చేశారు.
ఈ పోస్ట్ లో తమ లిటిల్ ప్రిన్స్ పేరును ‘దేవ్ నిడుమోరు’ గా వెల్లడించారు. అలాగే 2026 నవంబర్ 19 వ తేదీన బిడ్డ జన్మించినట్లు పేర్కొన్నారు. చిన్నారి తన వేలిని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణమంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ వార్తతో సమంత అభిమానుల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామ్, రాజ్ నిడుమోరు జీవితాల్లోకి అడుగుపెట్టిన దేవ్ నిడుమోరు కి అభిమానులు ప్రేమతో వెల్కమ్ చెబుతున్నారు.
Also Read : ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!
Follow Us On: Whatsapp


