Alltimereport : నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (National Film Awards) -2025 జ్యూరీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ చైర్మన్ గా సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna)ను నియమించిన సర్కార్.. సభ్యునిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను నియమించింది. ఈ ఐ అండ్ పీఆర్ శాఖ గురువారం అధికారిక జీవో నంబర్ 2213ను విడుదల చేసింది.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ -2025కు సంబంధించి సినిమాల ఎంపిక కోసం ప్రభుత్వం మొత్తం ఐదుగురితో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బాలకృష్ణ (Balakrishna) చైర్మన్ గా వ్యవరించనుండగా, అల్లు అరవింద్ తోపాటు ఎస్. గోపాల్ రెడ్డి, ప్రభ సభ్యులుగా నియమితులయ్యారు. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్.. సభ్యుడు, కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
కాగా, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్యూరీ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించింది.
Also Read : 149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!
Follow Us On: Whatsapp


