జగన్ కు సవాల్ విసిరినా టీడీపీ ఎమ్మెల్యే

జగన్ కు సవాల్ విసిరినా టీడీపీ ఎమ్మెల్యే

0
104

పాదయాత్ర లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాయకరావు పేట నియోజకవర్గలోని కోటవురట్లలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత సవాలు విసిరారు.

ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు అవినీతి పరులకు అవునీతి తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనపడడంలేదని విమర్శించారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు.
జగన్‌కు ఫ్లెక్సీలు కట్టిన వారే ఇసుక మాఫీయాలో పెద్ద దొంగలని విమర్శించారు. ఈ విషయం తాము చెప్పడం కాదని.. వారిపై కేసులు కూడ ఉన్నాయని అనిత అన్నారు. సీఎం కుర్చీ తప్ప జగన్‌కు ఇంకేమీ అవసరం లేదని.., నన్ను సీఎం చేస్తేనే మీ కోరికలు తీరుస్తున్నాడని, ఇలా అయితే జగన్ ఎప్పటికి సీఎం కాలేరని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం సరికాదని, రాజకీయాల కోసం కుటుంబాలని వాడుకుంది జగనేనని అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు.