టాప్ హీరోతో జత కట్టనున్న మజ్ను హీరోయిన్

టాప్ హీరోతో జత కట్టనున్న మజ్ను హీరోయిన్

0
112

టాలీవుడ్ కు మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యూల్ తన కెరీర్ లో పెద్దగా హిట్స్ లేకపోయినప్పటికీ తన అంద చందాలతో కను చూపులతో, గ్లామర్ ప్రదర్శిస్తూ మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటుంది… అయితే తమిళం లో తాను చేసిన ఒక సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది… ఇటు టాలీవుడ్ లో అజ్ఞాత వాసి సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించి నాపేరు సూర్యలో అల్లు అర్జున్ తో జతకట్టి మంచి పేరు సంపాదించుకుంది…

అనంతరం దర్శకుడు పరశు రామ్ నిర్మించిన గీత గోవిందం సినిమాలో కాసేపు గెస్ట్ రోల్ చేసిన ఈ భామ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కనున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేస్తుంది… తాజాగా ఈ గ్లామరస్ భామ తమిళ సినీ రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి సరసన నటించేందుకు కూడా సిద్దమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి… త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా తెలుపనుంది..