ఏపీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారు

ఏపీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారు

0
64

ఇప్పటికే చాల మంది రాజకీయ నాయకులు,సెలబ్రెటీస్ చంద్రబాబు నాయుడును పొగిడిన విషయం తెలిసిందే తాజాగా ప్రముఖ యోగ గురువు, పతంజలి కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాందేవ్ బాబా చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించాడు. చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, కొత్త రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారని అయన అన్నారు. అయితే ఇక్కడ వ్యవసాయాన్నికనుక మరింత ప్రోత్సహిస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని రామ్ దేవ్ బాబా కోరారు.

ఆ తరువాత ప్రత్యేకహోదా ఫై స్పందిస్తూ, ఏపీకి ప్రత్యేకహోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చాలని కోరుతున్నాని అయన అన్నారు. కేరళ వరద బాధితుల కోసం రూ.2 కోట్ల విలువ చేసే సరుకులను పతంజలి సంస్థ తరపున పంపినట్టు అయన అన్నారు. తరువాత బాబా రాజకీయాల గురించి మాట్లాడారు. నేను ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేనని, 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని తెలియచేసారు.