సునీల్ ఈజ్ బ్యాక్

సునీల్ ఈజ్ బ్యాక్

0
75

టాలీవుడ్ కమెడియన్ సునీల్. ఒకప్పుడు ఫుల్ కామెడీ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు . తరువాత కమెడియన్ నుండి హీరో గా మారితన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో మంచి విజయాల్ని అందుకున్న తరువాత , విజయాలు పూర్తిగా దూరమైయ్యాయి . దీనితో మళ్ళీ తనకి అచ్చొచ్చిన కామెడీ పాత్రల వైపు మొగ్గు చూపాడు తన ప్రాణ స్నేహితుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సలహా మేరకు .

సునీల్ హీరోగా మారిన తరువాత మళ్ళీ కమెడియన్ గా చేస్తున్న చిత్రం అరవిందసమేత వీరరాఘవ . ఈ సినిమా లో హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు . ఈ సినిమా పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది .కాబట్టి రాయలసీమ అంటేనే బంధాలు, బంధుత్వాలు అని మనకి తెలిసిందే , అలాగే సునీల్ ఈ సినిమాలో హీరోయిన్ కి అన్నగా నటిస్తున్నాడని సమాచారం .

ఈ సినిమాలో సునీల్ , ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఒకప్పుడు వెంకటేష్ తో నటించిన నువ్వు నాకు నచ్చవ్ లోని బంతి పాత్ర లాగా ఉంటాయని , ఈ సన్నివేశాలు అత్యంత అద్భుతంగా వచ్చాయని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది .