నీవేవెరో మూవీ రివ్యూ

నీవేవెరో మూవీ రివ్యూ

0
101

చిత్రం : నీవెవరో
నటీనటులు: ఆది పినిశెట్టి – తాప్సి – రితికా సింగ్ – వెన్నెల కిషోర్ – సప్తగిరి – తులసి – శివాజీ రాజా తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి – ప్రసన్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
రచన: కోన వెంకట్
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
దర్శకత్వం: హరినాథ్

కథ:

కళ్యాణ్ (ఆది పినిశెట్టి) 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన కుర్రాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చెఫ్ గా ఎదుగుతాడు. సొంతంగా రెస్టారెంట్ పెట్టి నడిపే స్థాయికి చేరుకుంటాడు. అతను అనుకోకుండా పరిచయమైన వెన్నెల (తాప్సి)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయడానికి కూడా ముందుకొస్తాడు. కానీ ఆలోపే అతను మరోసారి ప్రమాదానికి గురవుతాడు. ఈసారి కోలుకునే క్రమంలో అతడి కళ్లకు శస్త్రచికిత్స జరిగి మళ్లీ చూపు వస్తుంది. కళ్లు తెరిచి చూశాక అతడికి వెన్నెల కనిపించదు. తన జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. వెన్నెల కనిపించక పిచ్చోడైపోతున్న కళ్యాణ్.. ఆమె కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఇంతకీ వెన్నెల ఎవరు.. ఆమె నేపథ్యమేంటి.. ఆమె గురించి కళ్యాణ్ తెలుసుకున్నదేంటి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ అనే బ్లైండ్ క్యారెక్టర్ లో నటించిన ఆది పినిశెట్టి అచ్చం ఓ బ్లైండ్ లాగే నటించి మెప్పించాడు. లుక్స్ పరంగా పెర్ఫామెన్స్ పరంగా ఆది నటనలో తన మార్క్ చూపిస్తాడు. వెన్నెల (తాప్సి)తో ప్రేమలో పడే సన్నివేశాల్లో మరియు ప్రేమించిన అంమ్మాయి కోసం వెతికే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో ఆదిని సిన్సియర్ గా ప్రేమించే ‘అను’ పాత్రలో కనిపించిన రితికా సింగ్ చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తూనే.. ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో ప్రధాన పాత్ర తాప్సి నటించిన వెన్నెల పాత్ర. కథ మొత్తం వెన్నెల చుట్టే తిరుగుతుంది. అలాంటి వెన్నెల పాత్రలో తాప్సి అద్భుతంగా నటించింది. ఒకే పాత్రలో భిన్నమైన భావోద్వేగాలు పండించి తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చెప్పాలనుకున్న క్యారేకరైజేషన్స్ మరియు మెయిన్ థీమ్ తో పాటుగా కొన్ని సప్సెన్స్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శక రచయితలు రెండువ భాగం కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా రెండువ భాగంలో ఉత్సుకతను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ సింపుల్ గానే కథనాన్ని నడపడం అంతగా రుచించదు.

మొదటి భాగం మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సస్పెన్స్ ను బాగా మెయింటైన్ చేసి.. సెకెండాఫ్ లో ఒక్కసారిగా కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో సినిమా కొంత ట్రాక్ తప్పుతుంది. పైగా వెన్నెల కిషోర్ మరియు సప్తగిరి కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది గాని, బాగా నవ్వించిన సందర్భాలు తక్కువ. ఇలాంటి కామెడీ పెట్టి మంచి టెన్షన్ అండ్ సస్పెన్స్ తో నడిచే సినిమాని డిస్టర్బ్ చేసారని అనిపిస్తోంది.

ఇక కథకే కీలక పాత్ర అయిన ‘వెన్నెల’ పాత్ర గురించి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. చివర్లో మాటల రూపంలో ఆమె గురించి చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ పాత్ర అలా మారడానికి సంఘనటల రూపంలో ఉండి ఉంటే బాగుండేది.

నటీనటులు ప్రతిభ :

ఆది పినిశెట్టి అంధుడిగా ఉన్నంత వరకు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తనకు చూపు వచ్చినపుడు అతడి హావభావాలు మెప్పిస్తాయి. ఐతే ఒక దశ దాటాక అతడి పాత్ర తేలిపోయింది. అతను నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయింది. తాప్సి పాత్ర.. ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆ పాత్రలోని మరో కోణం చూపించే దగ్గర్నుంచి తాప్సి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రితికా సింగ్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వెన్నెల కిషోర్ కు మంచి లెంగ్త్ ఉన్న రోలే దొరికింది కానీ.. కామెడీ అతడి స్థాయికి తగ్గట్లుగా లేదు. సప్తగిరి కామెడీ కూడా పండలేదు. తులసి.. శివాజీ రాజా పాత్రలు.. నటన మామూలే.

చివరిగా – అంతగా ఆకట్టుకోలేక పోయింది

రేటింగ్ – 2.5/5