చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసిన జగన్

చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసిన జగన్

0
111

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడపై తీవ్ర విమర్శలు చేశారు . కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు రాష్ట్ర సమస్యలు గుర్తుకు రాలేదని దుయ్యబట్టారు.తాము అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని హామీ ఇచ్చారు.

ఈ రోజు యలమంచిలిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలన్న మాటలు నా మనస్సును కలిచి వేసాయి. చక్కెర కర్మగారాలు, నేవల్‌ సంబంధించిన సమస్యలున్నాయని వారు నా దృష్టికి తీసుకొచ్చారు. చక్కెర కర్మగారాల కోసం ఆశపెట్టుకున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. చక్కెర కర్మాగారాలు తెరిపిస్తానని జగన్‌ అనే నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. నష్టాల్లో ఉన్న ప్రతి ఫ్యాక్టరీని ఆదుకుంటాం. మూతబడిన ప్రతి ఫ్యాక్టరీని తెరిపిస్తాం’ అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

‘సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లు కేంద్రంతో సంసారం చేసినప్పుడు నేవల్‌ సమస్యలు గుర్తుకురాలేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. నేవల్‌ సమస్యతో నష్టపోయిన ప్రతి మత్స్యకారుడికి కేంద్రంతో సంబంధం లేకుండా దగ్గరుండి పనులు చేయిస్తాను’ అని జగన్ తెలిపారు.

‘దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కృషి వల్ల బ్రాండెక్స్‌ కంపెనీలో తమకు ఉద్యోగాలు వచ్చాయని అందులో పనిచేసే అక్కచెల్లెమ్మలు చెబుతుంటే సంతోషం కలిగింది. అందులో పనిచేస్తున్న వారికి చెబుతున్నా.. మేము అధికారంలోకి వస్తే బ్రాండెక్స్‌ కంపెనీతో మాట్లాడుతాం.. ఆ కంపెనీకి చేయాల్సిన మేలు చేస్తాం. దానికి దగ్గట్టుగా వేతనాలు పెంచాలని సూచిస్తాం’ అని జగన్ చెప్పారు.