మహేష్ బాబు సినిమా సెట్లో విజయ్ దేవరకొండ

మహేష్ బాబు సినిమా సెట్లో విజయ్ దేవరకొండ

0
66

ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగం గా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రధానమైన పాత్రలకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశాలు సినిమాలో కీలకమైన సందర్భంలో వస్తాయని చెప్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్లాడు. వంశీ పైడిపల్లితోను .. మహేశ్ తోను సరదాగా ముచ్చటించాడు. మహేశ్ బాబు సినిమా టికెట్స్ కోసం థియేటర్ల దగ్గర ఫైట్ చేసిన తాను . ఆయనను కలుసుకుని ముచ్చటించడం అద్భుతంగా అనిపించిందని విజయ్ చెప్పాడు అన్నాడు.

ప్రస్తుతం విజయ్ క్రేజ్ టాలీవుడ్ లో మాములుగా లేదు అని అందరికి తెలిసిందే , అర్జున్ రెడ్డి , గీతగోవిందం మూవీ లతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు .ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారు.