బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిని లెజిస్లెటివ్ క్యాపిటల్ లను అభివృద్ది చేసిన తర్వాత రాయలసీమ వారిని తరిమేయరన్న గ్యారంటీ ఏంటని ఆయన ప్రశ్నించారు…
అమరావతికి వెళ్లడమే చాలా కష్టం అనుకుంటుంటే ఇప్పుడు విశాఖకు మార్చు తున్నారని ఆయన మండిపడ్డారు… ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధాని ఉండేదని ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక బంగారు పళ్లెంలో తీసుకెళ్లి అమరావతిలో పెట్టారని ఇప్పుడు తిరిగి ఆ బంగారు పళ్లెంను విశాఖకు మార్చుతున్నారని టీజీ ఆరోపించారు…
చంద్రబాబు జగన్ ఇద్దరు సీమ వారే అయినప్పటికీ వీరికి వీరి ప్రాంతాలకంటే ఇతర ప్రాంతాలను బాగా చూసుకోవాలని ఉంటుందని అన్నారు… అంతేకాదు ఇప్పుడు మూడు రాష్ట్రాలు అయ్యే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని అన్నారు టీజీ…