విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది అక్కడి అమ్మాయినేనా ?

విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది అక్కడి అమ్మాయినేనా ?

0
111

అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ తన ఇమేజ్ అనూహ్యంగా పెరగడంతో తన తదుపరి చిత్రాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . సినిమాల విషయం పక్కన పెడితే ఈ హీరో ఇంతకుముందు 40 ఏళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట ! అయితే ఇప్పుడేమో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. నచ్చిన అమ్మాయి కనబడితే తప్పకుండా 35 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అయితే ఈ హీరో పెళ్లి చేసుకునే అమ్మాయి ఆంధ్రానా ? లేక తెలంగాణనా ? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

విజయ్ దేవరకొండ సోదరుడి పెళ్లి ఆమధ్య వరంగల్ జిల్లాలో జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాడు ఈ హీరో అయితే అప్పుడు ఎం ఎల్ ఏ ఎర్రబెల్లి దయాకరరావు విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే అతడికి కూడా ఇక్కడి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి విజయ్ కి షాకిచ్చాడు. తన వదిన వరంగల్ అమ్మాయే కాబట్టి పైగా మంచి మనసున్న అమ్మాయి కాబట్టి ఏమో! నాకు కూడా నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇక తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వరంగల్ అమ్మాయిని చూసి చేసుకుంటాడేమో చూడాలి. పెళ్లి ఎప్పుడౌతుందో కానీ ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని , పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనని మాత్రం స్పష్టం చేశాడు. మరి విజయ్ దేవరకొండ ఎక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.