టీడీపీ లో కి జగన్ సన్నిహితుడు.

టీడీపీ లో కి జగన్ సన్నిహితుడు.

0
73

2019 ఎన్నికలు దగ్గరకు వస్తున్నా తరుణంలో గుంటూరు జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తన మద్దతుదారులతో సమావేశమయ్యి అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దానికి కారణం చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ను ఇటీవలే వైసిపిలో చేరిన ఒక మహిళా ఎన్నారైకు ఇవ్వబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం. పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి కష్టపడిన ఆయనను కాదని నియోజకవర్గంలో మరో నేతను ముందుకు తీసుకురావడమే వివాదానికి కారణమైంది. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట ఇంచార్జిగా ఉన్నారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత విడదల రజినీశుక్రవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆమె అలా పార్టీలో చేరిందో లేదో ఆమెను వెంటనే నియాజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమించింది అధిష్టానం.

ఈ పరిణామం మర్రి రాజశేఖర్ కు గానీ, ఆయన అనుచరులకి గానీ అస్సలు మింగుడుపడడం లేదు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తమ నేతను కాదని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారిని సమన్వయ కర్తగా నియమిస్తారా అంటూ మర్రి రాజశేఖర్ వర్గం అధిష్ఠానం తీరుపై సీరియస్ గా ఉంది. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలి కాలం వరకూ వైకాపాకు జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించిన రాజశేఖర్ ఏకంగా పార్టీ మారేందుకు, టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఆయన ప్రకటన కంటే ముందే జిల్లాకు చెందిన వివిధ పార్టీ పదవుల్లో ఉన్న సుమారు 404 మంది వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. మర్రి రాజశేఖర్ వెంటే మేమంతా ఉంటామని ప్రకటించారు. అయితే రజనీకుమారి మాత్రం మర్రి రాజశేఖర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించడం కొసమెరుపు. ఆయనను కలిసి ఆశీసులు తీసుకునే తను జగన్ దగ్గరకు వెళ్లానని చెబుతున్న ఆమె సీటు విషయం మీద మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.