శివుడికి ఇక్క‌డ నైవేధ్యంగా సిగ‌రెట్లు ఇంకా ఏం పెడ‌తారో తెలిస్తే షాక్

శివుడికి ఇక్క‌డ నైవేధ్యంగా సిగ‌రెట్లు ఇంకా ఏం పెడ‌తారో తెలిస్తే షాక్

0
131

శివుడుకి పండు కొబ్బ‌రికాయ లేదా ఆవుపాల‌తో అభిషేకం చేస్తారు… లేదా రుద్రాభిషేకం చేస్తారు… ఇలా మంత్రాలు జ‌పిస్తారు.. లేదా పువ్వులు ప‌త్రాల‌తో స్వామిని కొలుస్తారు, ఇక పిండివంట‌కాల‌తో స్వామికి నైవేద్యం పెడ‌తారు.. కాని ఇక్క‌డ దేవాల‌యంలో మాత్రం వింత ఆచారం ఉంది.

ఈ శివాలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే ఈ విచిత్ర ఆచారం చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్లాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని లుట్రు మహాదేవ్ ఆలయం ఉంది. ఈ శివాల‌యం నిత్యం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంది.

అయితే ఇక్క‌డ శివ‌రాత్రిరోజు పెద్దఎత్తున పండుగ చేస్తారు. అయితే శివ‌రాత్రి రోజున స్వామికి మొక్కులు చెల్లిస్తారు.ఇక్కడి శివలింగంపై సిగరెట్ ను ఉంచితే దానికదే వెలుగుతుందని భక్తులు నమ్ముతారు. మొత్తమ్మీద ఈ విచిత్ర ఆచారంతో లూట్రా మహాదేవ్ ఆలయం విపరీతమైన ప్రాచుర్యం పొందుతోంది.