పులివేట‌- రాత్రి ప‌క్క‌నే ఉన్నాడు తెల్లారేస‌రికి పిల్ల‌వాడు లేడు ఏమ‌య్యాడో తెలిస్తే క‌న్నీళ్లే

పులివేట‌- రాత్రి ప‌క్క‌నే ఉన్నాడు తెల్లారేస‌రికి పిల్ల‌వాడు లేడు ఏమ‌య్యాడో తెలిస్తే క‌న్నీళ్లే

0
86

అత్యంత దారుణం, అడ‌వికి స‌రిహ‌ద్దుల్లో ఉన్న గ్రామాల ద‌గ్గ‌ర ఉన్న ఇళ్ల‌కు ప‌రిస్దితి ఎలా ఉంటుంది అనేది మ‌రోసారి తెలిసింది, ఇక్క‌డ ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి అని మ‌రోసారి హెచ్చ‌రించింది ఈ ఘ‌ట‌న‌, అత్యంత దారుణం జ‌రిగింది. రాత్రి వ‌ర‌కూ మూడు సంవ‌త్స‌రాల పిల్ల‌వాడు త‌ల్లి ద‌గ్గ‌రే ఉన్నాడు, ఈ స‌మ‌యంలో రాత్రి ప‌డుకున్నారు ఇంట్లో అంద‌రూ.

అయితే వేడి ఉక్క‌పోత ఎక్కువ ఉండ‌టంతో త‌లుపులు తీసి ప‌డుకున్నారు అంద‌రూ …మంచి నిద్ర‌లో ఉండ‌గా తెల్ల‌వారుజామున చిరుత పులి ఇంటిలోకి వ‌చ్చింది, తలుపులు తీసి ఉండ‌టంతో ఆ చిన్నారిని త‌న నోటితో క‌రిచి తీసుకువెళ్లిపోయింది.

ఏకంగా 10 కిలోమీట‌ర్ల దూరం తీసుకువెళ్లి చంపేసింది, అక్క‌డ అంతా వెతికిన గ్రామ‌స్తుల‌కి బాబు బ‌ట్ట‌లు క‌నిపించాయి, దీంతో బాబుని చిరుత చంపేసింది అని తెలిసి క‌న్నీరు మున్నీరు అయ్యారు, ఈదారుణం క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది, ఆత‌లుపులు వేసి ఉంటే ఆ బాబు బ‌తికి ఉండేవాడేమో