ఈ కరోనా వేళ పెళ్లి వద్దు అంటున్నారు వైద్యులు పోలీసులు , కాని కొందరు వివాహాలు పోస్ట్ పోన్ చేయక చాలా మంది చేసుకుంటున్నారు… కొందరు కుటుంబ సభ్యుల మధ్య ఇంటిలో జరుగుతున్నాయి, అయితే తాజాగా ఓ వ్యక్తి తన ప్రేమని కుటుంబ సభ్యులకి చెప్పి ఒప్పించి పెళ్లికి అంగీకారం పొందాడు.
ఒడిశా నుంచి ఏకంగా బెంగాల్ వెళ్లి పెళ్లికి రెడీ అయ్యాడు, అక్కడ కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి జరిగింది, అయితే పెళ్లి అయిన తర్వాత అతగాడికి వైద్య పరీక్షలు చేస్తే అతనికి కరోనా అని తేలింది, చివరకు అతనిని వైద్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
భార్యకి మరదలికి పెళ్లికి వచ్చిన 120 మందికి టెస్టులు చేశారు.. కొందరికి నెగిటీవ్ వచ్చింది.. మరికొందరి రిజల్ట్ రావాల్సి ఉంది.. దీంతో ఈ పెళ్లితో అక్కడకు వెళ్లినవారు అందరూ భయపడుతున్నారు, మనకి వస్తుంది ఏమో అని టెన్షన్ పడుతున్నారు , ముందుగా 65 మంది టెస్ట్ చేయించుకున్నారట, పెళ్లి కూతురు కుటుంబానికి కూడా వైరస్ సోకలేదు.