ఒక్కోసారి లక్ చాలా బాగుంటుంది… అదృష్టం ఇంటి దాకా వస్తుంది, ఈ కుటుంబానికి తోటలో అదృష్టం కలిసి వచ్చింది, ఈ లాక్ డౌన్ వేళ పిల్లలు ఇంటిలోనే ఉంటున్నారు, ఈ సమయంలో ఇండోర్ గేమ్స్ తోనే సమయం గడిపేస్తున్నారు అయితే ఫ్రాన్స్ లోని ఓ ఇంటిలో ఇలాగే ఇద్దరు సోదరులు సరదాగా ఆడుకుంటూ చేసిన పని వారి జీవితాలనే మార్చేసింది.
కొన్ని వస్తువులతో ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు.. ఈ సమయంలో వారికి బంగారు బిస్కెట్లు కనిపించాయి.. అవి ఏమిటో వారికి తెలియదు వెంటనే తండ్రికి తీసుకువెళ్లి చూపించారు, అవి తోటలో ఉండటంతో షాకైన అతను అంతా వెతికాడు, ఆ బిస్కెట్ కిలో ఉంది.
అయితే అది అతని తల్లి 1967 లో ఆ బంగారు బార్లు కొనుగోలు చేసింది వాటి బిల్లులు ఇంటిలో కనిపించాయి, వాటిని అప్పటి నుంచి ఇంటిలో పెట్టింది కాని అవి తోటలోకి చేరాయి.. చివరకు వారసులు పిల్లలకు కనిపించాయి, వీటిని ఆన్ లైన్ లో అమ్మకానికి ఓ వెబ్ సైట్ ద్వారా పెట్టాడు.. సుమారు 65 లక్షల రూపాయలు పలుకుతోంది ఆ గోల్డ్ ధర. దీంతో తను ఎంతో లక్కీ పర్సెన్ అంటున్నాడు అతను.