అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి… ప్రస్తుతం పార్టీలో ఉండే వారు ఎవరో జంపింగ్ జిలానిలు ఎవరో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది… ఇక అధికార వైసీపీ కూడా టీడీపీకి షాక్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది… కొంతమంది టీడీపీ నేతలతో వైసీపీ సీనియర్లు టచ్ లో ఉన్నారని త్వరలో పార్టీ మార్పు కాయమని వార్తలు వస్తున్నాయి…
అయితే వీటిని సదరు నాయకులు ఇప్పటి వరకు ఖండించకపోవడం గమనార్హం… ఇప్పుడు ఇలాంటి జాబితాలో మరో కీలక నేత పేరు వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టిడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ తీర్ధం తీసుకున్న పితాని ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు…
2017 లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పితానికి అవకాశం దక్కింది.. అయితే ఇప్పుడు పితాని పరిస్థితి సరిగ్గాలేదు… దాదాపు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన పితాని జిల్లా రాజకీయాలను ఏలారు… అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో ఆయన మాట ఎవ్వరు లెక్కచేయకున్నారట.. అందుకే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి…