కేజీఎఫ్.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇవి మనకు ఈ మధ్య బాగా తెలిసాయి సినిమా ద్వారా, అయితే కర్ణాటక వాసులకి మిగిలిన వారికి ఇవి చాలా తెలిసినవే, అయితే ఇందులో ఇప్పుడు బంగారు నిల్వలు తగ్గిపోవడంతో అక్కడ బంగారు తవ్వకాలు ఆపేశారు, ఇది క్లోజ్ చేశారు, అయితే ఇక్కడ బంగారం కంటే విలువైన లోహ నిక్షేపాలు ఉన్నాయని అంటున్నారు ఆ రాష్ట్ర ఎంపీ మునిస్వామి.
ఆ లోహ నిక్షేపాలను వెలికి తీసేందుకు త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. ఈ ప్రాంతంలోనే పల్లాడియం లోహముందని తెలిపారు. ఇది బంగారం ప్లాటినం కంటే విలువైనది, మరీ వేడి చేయనక్కర్లేదు.
ప్లాటినం కుటుంబానికి చెందిన పల్లాడియం వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో పోలిస్తే, తక్కువ ఉష్ణోగ్రతకే కరిగిపోతుంది.ఇది ఎలక్ట్రానిక్ వస్తువులు కార్లవిడి బాగాల తయారీలో వాడతారు, ఇది ప్రపంచంలో రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో లభిస్తుంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నా అక్కడ సప్లై లేదు, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నారు అందరూ.