సీఎం జగన్ కు షాక్… మరోసారి హాట్ కామెంట్స్ చేసిని రఘురామకృష్ణంరాజు…

సీఎం జగన్ కు షాక్... మరోసారి హాట్ కామెంట్స్ చేసిని రఘురామకృష్ణంరాజు...

0
95

తనను ఎంపీగా అనర్ముడిని చేసేందుకు ఓ వైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ప్రాధాని మోడీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు… ఇటీవల ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రశంసిస్తూ లేఖ రాశారు మరో వైపు శుక్రవారం వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలువబోతున్న తరుణంలో వైసీపీలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి… అంతేకాదు కేంద్ర చేపడుతున్న పథకాలను కొనియాడుతూ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి…

తాజాగా ఆయన ప్రధానికి లేఖ రాసి రాజకీయాల్లో సంచలనం రేపారు… గరీబ్ కళ్యాణ్ పొడిగింపుపై ప్రశంశలు కురిపించారు వైసీపీ ఎంపీ… మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ తన లేఖలో రాశారు రఘురామకృష్ణంరాజు…అంతేకాదు వైసీపీ నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడం వృథా అని ప్రయాసే అని కొట్టిపారేశారు… ప్రభుత్వ డబ్బులు వృదా చేయడమే అని కొట్టిపారేశారు…

గతంలో దేవుడి భూములు అమ్మడం సరికాదని చెప్పానని సీఎం స్పందించి భూములు అమ్మడం నిలిపివేయించారని అన్నారు…తాను పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు… ఇసుక భూముల విషయాల్లో తప్పులు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు… ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే సస్పెండ్ చేస్తే పార్లమెంట్లో ఎవరు ఉండరని అన్నారు.. ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఢిల్లీ ప్రయత్నాలు విరమించుకోవడం మంచిదని అన్నారు…