ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… ఈ మహమ్మారికి అడ్డుకట్టవేసేందుకు డాక్టర్లు నిరంతర కష్టపడుతుంటే శాస్త్రవేత్తలు మందుకనుక్కునే పనిలో పడ్డారు… అయితే అగ్రరాజ్యం అయిన అమెరికా మాత్రం కరోనాను లెక్క చేయకుంది…
కరోనా వచ్చిన వారు సంతోషంగా పార్టీలు చేసుకోవడం పార్టీలు ఇవ్వడం చేస్తారు… ఇంకొందరు అయితే కరోనా వైరస్ సోకితే ఎలా ఉంటుందో చూద్దామంటూ కొంతమంది యువకులు పార్టీలకు వెళ్తున్నారు.. తాజాగా ఒక వ్యక్తి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడు.,.. ఈపార్టీకి వెళ్లిన సదరు స్నేహితుడికి దురదృష్టవ శాత్తు కరోనా పాజిటివ్ అని తేలింది…
తనను కరోనా ఏం చేయలేదంటూ ధీమా వ్యక్తం చేశాడు… కానీ ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు… మరణానికి ముందు తాను పార్టీకి వెళ్లి తప్పుచేశానని డాక్టర్లకు చెప్పాడట… కరోనా విషయంలో ఎవ్వరు నిర్లక్ష్యం వహించవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు…