బాబుని ఈ విషయంలో టెన్షన్ పెడుతున్న జగన్

బాబుని ఈ విషయంలో టెన్షన్ పెడుతున్న జగన్

0
84

ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు, వైసీపీ గట్టిషాక్ ఇచ్చింది. అన్ని సామాజిక అంశాలు వర్గాలు పరిశీలించి జగన్ పలు చోట్ల అభ్యర్దుల ఎంపికను చేశారు.. వైసీపీ అధినేత లోక్ సభ అభ్యర్దులు 25 లో, బీసీలకు 7 లోక్సభ స్థానాలు కేటాయించారు.. అలాగే మహిళలకు 15, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, ముస్లిం మైనార్టీలకు 5 స్థానాలు కేటాయించడం ఇక్కడ అందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది.

వైఎస్సార్సీపీ 41 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది.. జగన్ పలు స్క్రీనింగ్ లు అభ్యర్దుల వడపోత సర్వేలు చేసి ఈ లిస్ట్ ప్రకటించారు.. ముఖ్యంగా జగన్ కు సపోర్ట్ గా నిలచేది బీసీ వర్గమా కాదా అనేది కూడా వీరి విజయం తర్వాత తేలుతుంది. ఇప్పటి వరకూ బీసీ కార్డు చూపించుకునే తెలుగుదేశం, ఎలాంటి రాజకీయ ఎత్తులు వేస్తుందో చూడాలి. ఇంకా తెలుగుదేశం పార్టీ మరికొందరు అభ్యర్దుల లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. అలాగే జనసేన కూడా మరికొందరి లిస్టు విడుదల చేయాలి. మరో పక్క ఏపీలో నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.