జగన్ కు కొణతాల షాక్ డైలమాలో వైసీపీ

జగన్ కు కొణతాల షాక్ డైలమాలో వైసీపీ

0
53

ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే ఎన్నికల వేళ కొత్త నేతలు ఎవరు వచ్చినా పార్టీ కండువా కప్పి ,సాదర స్వాగతం పలుకుతున్న జగన్ కు, కొణతాల షాక్ ఇచ్చారు అనే చెప్పాలి. వైసీపీలో చేరేందుకు తన కేడర్ తో కలిసి ఆయన హైదరాబాద్ లోని జగన్ కార్యాలయానికి వెళ్లారు.. ఈ సమయంలో అందరికి పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.. కాని ఈ సమయంలో కొణతాల మాత్రం పార్టీ కండువా కప్పుకోను అని తెలియచేశారు.

గతంలో తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తే సరిపోతుందని, ఇక పార్టీ తరపున కండువా అక్కర్లేదు అని అన్నారట.. కాని ముందు కండువా వేసుకో అన్నా ఆ సస్పెన్షన్ తరువాత చూద్దాం అని జగన్ చెప్పినా, కొణతాల ఒకే చెప్పలేదట. అందుకే జగన్ కూడా అనకాపల్లి టికెట్ చివరి నిమిషంలో వేరే వారికి చ్చారు అని డాక్టర్ కేవీ సత్యవతి పేరును తెరపైకి తెచ్చారు అని అంటున్నారు.. మరి కొణతాల దాడి ఇద్దరూ రాజకీయ ప్రత్యర్దులు.. ఇప్పుడు ఇద్దరూ వైసీపీ తరపున ఆమెకు ప్రచారం చేస్తారా లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా ఇక్కడ మారింది. దాడికి కొణతాలకు ఇద్దరికి జగన్ సీటు ఇవ్వకపోవడంతో రెండు వర్గాలు షాక్ అయ్యాయి.