లక్ష్మీస్ ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ రిలీజ్ ఎప్పుడంటే

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ రిలీజ్ ఎప్పుడంటే

0
54

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలతో సావాసం చేస్తారు.. ఇప్పుడు అంతా బయోపిక్ ఫీవర్ నడుస్తోంది.. దానినే ఈ కాంట్రవర్సీ కింగ్ తీసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఎన్నికల వేళ హీట్ పుట్టించారు.. మరి ఈ సినిమాలో ముందు నుంచి సీఎం చంద్రబాబు పై వెన్నుపోటు అనే అంశంలో డీ గ్రేడ్ చేస్తూ చూపిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదే ఆరోపణలు అనేకం వినిపించాయి. ఇక ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ఉండేలా ఇది బాబుకి నెగిటీవ్ అవుతుంది అని కొందరు సెన్సార్ బోర్డుకి ఈసీకి కంప్లైంట్ చేశారు.

ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సెన్సార్ బోర్డుతో కలిగిన ఇబ్బందులను పరిష్కరించుకున్న చిత్రబృందం, తమ సినిమాను బుధవారం సెన్సార్ క్లియరెన్స్ కోసం పంపనున్నారు. అయితే ముందు అనుకున్న మార్చి 22 న ఈ సినిమా విడుదల అవుతుందా అంటే ఇప్పటి వరకూ ఈ సినిమా మార్చి 22 న విడుదల కష్టం అని అనుకున్నారు ..ఈ సినిమాకు తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారు. కావాలి అంటే ఎన్నికలు అయ్యాక ఏప్రిల్ 11 తర్వాత విడుదల చేయాలి అని అంటున్నారు. మరో పక్క వర్మ కూడా నేను కోర్టుకు వెళతాను అంటున్నారు. కాని ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నారట వర్మ.మరి ఇదైనా పక్కానా కాదా అనేది చూడాలి.