మాళిపుర గ్రామంలో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది ఇటీవల, అయితే ఆమె తల్లిదండ్రులు పక్క గ్రామంలో ఓ వ్యక్తితో దనిష్టకి పెళ్లి కుదిర్చారు, ప్రేమించిన వాడిని మర్చిపోయి ఈ సంబంధం చేసుకో, లేకపోతే పురుగులు మందు తాగి చనిపోతాం అని బెదిరించారు ఆమె తల్లిదండ్రులు. దీంతో ఆమె మెడ వంచి తాళి కట్టించుకుంది.
కాని భర్తకి అనుమానం వచ్చింది.. ఆమెని పెళ్లి సమయంలో కూడా అడిగాడు పెళ్లి ఇష్టమేనా అని..కాని ఆమె తల్లి దండ్రులు చనిపోతారు అనే భయంతో ఇష్టమే అని చెప్పింది, అయితే శోభనం రోజు పాల గ్లాసుతో వెళ్లిన ఆమె గుక్క పెట్టి ఏడ్చింది.
తను ఓ వ్యక్తిని ప్రేమించానని ఆ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని చెప్పడంతో, వెంటనే ప్రియుడికి ఫోన్ చేశాడు ఆమె భర్త, అతని మిత్రుడు కానిస్టేబుల్ ఉంటే అతనికి ఫోన్ చేసి పోలీసులు సాయంతో ఆమె ఇంటికి ప్రియుడిని తీసుకువచ్చారు. ఆ ప్రియుడిని చూసి ఆమె కన్నీరు పెట్టుకుంది, తల్లిదండ్రులు చేసిన తప్పుని అందరి ముందు పెట్టి ప్రియుడికి ఆమెని ఇచ్చి అందరి ముందు పెళ్లి చేశాడు భర్త, కేవలం డబ్బు ఉంది అనే కారణంతో ఈ పెళ్లి చేశారు, అయితే అతను మాత్రం ఈ ప్రేమ జంటను విడగొట్టి నేను ఆమెతో కాపురం చేయలేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పాడు .