చాలా మంది అతిఖరీదైన పెయింటింగ్స్ కొంటూ ఉంటారు, ఇంట్లో ప్లెసెంట్ గా ఉంటాయి అని చాలా మంది వీటిని కొంటూ ఉంటారు, లక్షల్లో కోట్లలో కొనే ధనవంతులు కూడా ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా వీటిని కొనుగోలు చేస్తారు.
అయితే ఇంట్లో ఎలాంటి పెయింట్స్ ఉంటే మంచిది అనేది చూద్దాం.. నవ్వుతున్న మహిళ, ప్రకృతి అందం, గ్రామీణ సౌందర్యం వంటి ఇమేజస్ ఇంటీరియస్‌ను మెరుగు పరుస్తాయి. ఇక దేవుడి ప్రతిమలు కూడా అందంగా ఉంటాయి పెయింట్స్ లో ఇవి తూర్పు వైపు పెట్టుకుంటే చాలా మంచిది.
ఇంటికి శాంతి కారణంగా వీటిని చాలా మంది తూర్పు వైపు పెడతారు.బుద్ధుడు శాంతికి, అలాగే జ్ఞానానికి ప్రతీక. చుట్టూ పాజిటివ్ ఎనర్జీస్ ఉండటం ముఖ్యమే. పూజ గదిలో బెడ్ రూమ్ లో మాస్టర్ బెడ్ రూమ్ లో హాల్ లో ఎక్కడ అయినా వీటిని పెట్టుకోవచ్చు ఇది చాలా మంచిది.