నేను వచ్చేస్తా అంటున్న టీడీపీ ఎమ్మెల్యే… కాస్త ఓపికపట్టు అంటున్న వైసీపీ

నేను వచ్చేస్తా అంటున్న టీడీపీ ఎమ్మెల్యే... కాస్త ఓపికపట్టు అంటున్న వైసీపీ

0
80

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి… రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి తమ్ముళ్లు ఇతర పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు..

ఇప్పటికే చాలామంది మాజీలు టీడీపీ కండువాను తీసి ఇతర పార్టీ కండువాను భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే… ఇక 2019 ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకున్న టీడీపీ అందులో ముగ్గురు వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు…

ఇక ఈ పరంపర ఇక్కడితో ఆగిపోతుందా అంటే ఇంకా కొనసాగే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… తాజాగా గోదావరి జిల్లాకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… చాలా కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.. ఈ అసంతృప్తితోనే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట… అయితే వైసీపీ మాత్రం కొన్నిరోజులు ఆగమని చెబుతోందట…