కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది.. ముఖ్యంగా సెలబ్రిటీలను రాజకీయ ప్రముఖులు ఈ మాయదారి మహమ్మారి బారీన పడుతున్నారు… ఇప్పటికే చాలామంది కరోనా బారీన పడి కోలుకోగా మరికొంతమంది మృతి చెందారు…
- Advertisement -
తాజాగా ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారీన పడ్డారు… ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది… దీంతో ఆమె హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు…
ఇటీవలే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్రం ప్రకటించింది… ఇదే సమయంలో నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు… వారందరు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు…