మన క్రికెట్ ఆటగాడు టీమిండియా మాజీ సారథి ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు, అయితే ఐపీఎల్ మాత్రం ఆడనున్నాడు ధోని, ఈ నిర్ణయం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు, ఇలాంటి నిర్ణయం ఇంత వెంటనే తీసుకోవడం ఏమిటి అని అందరూ షాక్ అయ్యారు.
అయితే ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు అనేది తెలిసిందే, సో మరి ఐపీఎల్ తర్వాత ధోని ఏం చేయబోతున్నారు, ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఆయన ఉన్నారు.. పలు వ్యాపారాలు చేస్తున్నారు ధోని.
మరి తర్వాత ఏమైనా అకాడమీ స్టార్ట్ చేస్తారా అని చాలా మంది ఆలోచించారు, దీనిపై ఇంకా ప్రకటన రాలేదు.. తాజాగా ఓ వార్త వినిపిస్తోంది..ఐపీఎల్ తర్వాత ధోని ఎంటర్టైన్మెంట్ రంగంలో బిజీ కానున్నారు.
2019లోనే ధోనీ ఎంటర్టైన్మెంట్ పేరుతో మహీ ఓ సొంత బ్యానర్ను స్థాపించిన విషయం తేలిసిందే.ఈ బ్యానర్లో ఇప్పటికే జార్ఖండ్ డైనమేట్ రోర్ ఆఫ్ ది లయన్ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఇక నెక్ట్స్ మరోస్టోరీ రానుంది, ఈ స్టోరీ విషయంలో అంతా ఆయన భార్య సాక్షి ధోని చూస్తున్నారట.
రహస్యంగా సాగే ఓ అగోరి ప్రయాణానికి సంబంధించిన పురాణ సైన్స్ ఫిక్షన్ కథను వెబ్ సిరీస్గా చేస్తున్నాము..ఓ ఆఘోరి రహస్య ప్రయాణమే ఈ కథ. ….తన ప్రయాణంలో ఓ అఘోరి వెల్లడించిన రహస్యాలు వెబ్ సీరిస్లో ఉంటాయని సాక్షి తెలిపారు.వీటి హక్కులు కూడా ఇప్పటికే తీసుకున్నారట.