హీరో మోటొకార్ప్ మీ ఇంటికే సర్వీసు రూ. 350 చెల్లిస్తే చాలు బెస్ట్ ఆఫర్

-

హీరో మోటొకార్ప్ చాలా మంది టూ వీలర్లు ఈకంపెనీవి వాడుతూ ఉంటారు, మరీ ముఖ్యంగా కస్టమర్లకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది, ఫెస్టివల్ సమయంలో అనేక ఆఫర్లు కూడా ఇస్తుంది, తాజాగా హీరో మోటొకార్ప్ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు లాంచ్ చేసింది. మరి ఆ సర్వీసులు ఏమిటి అనేది చూద్దాం.

- Advertisement -

టూవీలర్ కస్టమర్ల కోసం రోడ్సైడ్ అసిస్టెంట్ సర్వీసులు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతేకాదు 24 గంటలు కస్టమర్లు దీనిని వాడుకోవచ్చు, మరి ఈ సర్వీసులు పొందడం ఎలా అనేది చూద్దాం.

హీరో కస్టమర్ యాప్ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందొచ్చు. ఒకవేళ మీకు దగ్గరిలోని షోరూమ్ ఉంటే అక్కడ కూడా ఈ సర్వీస్ వాడుకోవచ్చు. అయితే ఇది ఉచితంగా కాదు ఇలా సర్వీసు మీకు కావాలి అంటే ఏడాదికి
రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మొత్తం చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి పలు రకాల సేవలు లభిస్తాయి.

మీకు బైక్ రిపేర్ అయితే స్పాట్ లో కాల్ చేయగానే తక్షణం మెకానిక్ టీమ్ అక్కడకు వస్తారు, ఒకవేళ అవ్వకపోతే దగ్గర్లో షోరూమ్ కు తీసుకువెళతారు, ఇక బైక్ ల పెట్రోల్ అయిపోతే వారే మీకు పెట్రోల్ తెస్తారు నగదుకి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఫ్లాట్ టైర్ సపోర్ట్, బ్యాటరీ జంప్ స్టార్ట్, కీ రెట్రీవల్ సపోర్ట్ వంటి సేవలు పొందొచ్చు. అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి ఈ సర్వీసులు… మీకు ఏదైనా డౌట్ ఉంటే దగ్గర్లో షోరూమ్ లో ఈ సేవల గురించి తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...