సోనూ సూద్ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, ఇక సినిమాల్లో ఆయన విలన్ రోల్స్ చేసినా నిజ జీవితంలో ఆయన ఓ హీరో అనే చెప్పాలి రియల్ హీరో, ఇక ఈ లాక్ డౌన్ వేళ వలస కూలీలకు ఆయన చేసిన సాయం అంతా ఇంతాకాదు, ఎందరికో తమ సొంత ప్రాంతాలకు గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాడు.
దేశ వ్యాప్తంగా ఎంతో మంది సోనూను అభినందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో సోనూకు ఏకంగా గుడిని నిర్మించారు.మన తెలుగు ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చూపించారు, అయితే ఇలా తమకు నచ్చిన హీరోలు హీరోయిన్లకి ఎక్కువగా దేవాలయం నిర్మించేది తమిళనాడులోనే అని చెప్పాలి.. అక్కడ ప్రేక్షకులు అభిమానులు తమకు నచ్చిన అభిమాన హీరోకి హీరోయిన్ కి గుడికట్టిన సందర్బాలు ఉన్నాయి.
తాజాగా సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తాండా పరిధిలోని చెలిమితాండాలో రాజేశ్ అనే అభిమాని విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేశ్ కు సోనూ సూద్ అంటే ఎంతో అభిమానం. ఆయన చేసిన పనికి గుడికట్టించాడు, మనసున్న మనిషి అని తెలిపాడు, ఇక ఆయన సొంత ఖర్చుతో సోనూసూద్ కి గుడి నిర్మించాడు.