విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్ వైరల్

విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్ వైరల్

0
100

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుపై నిన్ను వదలను బాబు అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. రోజుకో అంశంతో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు ఆయన.. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన పై విమర్శలు చేస్తున్నారు.. కాని ఆయన పట్టుకునే పాయింట్ పై మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఇది రివర్స్ తెలుగుదేశం నేతలకు విమర్శల పాలు చేస్తోంది. తాజాగా విజయసాయిరెడ్డి మరో ట్వీట్ తో బాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు.

చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సిబిఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ బాధపడుతున్నాడట. ఇలా విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టడంతో పెద్ద ఎత్తున వైసీపీ దీనిని వైరల్ చేస్తున్నారు.